మెగాపవర్ స్టార్ సారీ చెప్పిన అమెరికన్ నటుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సారీ చెప్పారు అమెరికన్ నటుడు టిగ్ నొటారో. ఆర్ఆర్ఆర్ మూవీ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్లింది. బాహుబలి మూవీ తో తెలుగు సినిమా సత్తా ఏంటో హాలీవుడ్ కు రుచి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. ఇక ఈ చిత్రం తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్థాయి ఓ రేంజ్ కి వెళ్లింది. తాజాగా రామ్ చరణ్ రేంజ్ హాలీవుడ్ సినిమాల అవార్డుల వేడుకలో యాంకరింగ్ చేయమని పిలిచే వరకు వెళ్లిందంటే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చరణ్ అమెరికా లో సందడి చేస్తున్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో ప్రజెంటర్‌గా చరణ్ పాల్గొన్నారు.
కాలిఫోర్నియా వేదికగా జరిగిన ఈ వేడుకలో అమెరికన్ నటుడు టిగ్ నొటారో చరణ్‌కు క్షమాపణలు తెలిపారు. చరణ్ పేరును ఎలా పలకాలో తెలియడం లేదన్నారు. టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో అవార్డ్ ప్రజెంటర్‌గా చరణ్ పాల్గొన్నారు. హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి బెస్ట్ వాయిస్/మోషన్ క్యాప్చర్ అవార్డును అందించారు. అయితే, రామ్‌చరణ్‌ను స్టేజ్ పైకి పిలిచే క్రమంలో టిగ్ నొటారో.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’తో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్‌స్టార్ రామ్..’’ అంటూ చరణ్ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు. స్టేజ్ వెనుక ఉన్న బృందం సాయం చేయడంతో చరణ్ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే రామ్‌చరణ్ వద్దకు వెళ్లి క్షమాపణలు తెలిపాడు.