ప్రేయసి రొయ్యల కూర

Nikhil-Dr pallavi varma

యంగ్ హీరో నిఖిల్ ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డాక్టర్ పల్లవి వర్మతో ఒక డీసెంట్ ఈవెంట్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని అభిమానులకు షాకిచ్చాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం చేసుకుని సగం పెళ్లయ్యిందనిపించేసారు. ప్రేమైక లోకంలో మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా లీకులిస్తూ అభిమానుల్ని ఊరిస్తున్నాడు నిఖిల్.
ప్రేమికులుగా ఒకరికి ఒకరు బహుమతులిచ్చుకోవడం సహజంగా జరిగేదే.  అలా నిఖిల్ తన ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ ప్రోమాక్స్  కొనిచ్చాడుట మరి ప్రియుడికి ప్రేయసి అందించిన తొలి బహు మతి ఏమిటో అంటే ?  నిఖిల్ కి ఎంతో ఇష్టమైన రొయ్యల కూరను స్వయంగా వండి అందించిందట. ఇంకేం ఉంది? నిఖిల్ లొట్టలేసుకుని రొయ్యల కూర లాగించేసాడట …

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/