నేడు నరసరావుపేటలో గోపూజ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో…

Home Mr. Sucharita inspecting Gopuja arrangements
AP Home Minister Sucharita inspecting Gopooja arrangements

NarasaraoPet: కనుమ పర్వదినం రోజు ( శుక్రవారం ) నరసరావుపేట పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కామధేను పూజ (గో పూజ ), 108 ఆలయాలకు గోవులను దానమిచ్చే గొప్ప కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతున్నదని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

గురువారం నరసరావుపేట పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే గో పూజ కార్యక్రమంఏర్పాట్లను రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలకో ఆర్డినేటర్ తలసీల రఘురామ్, జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ తో కలసి పరిశీలించారు. స్టేజ్ ఏర్పాట్లు,ప్రేక్షకుల గ్యాలరీ, స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. గో పూజ కార్యక్రమంలో పాల్గొననున్న గోవులను పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ హిందు సాంప్రదాయంలో గోమాతను ఇంటి మహాలక్ష్మిగా పూజిస్తారన్నారు. మన సాంప్రదాయంలో పాడి పంటలో పాడికి ప్రాశస్త్యం వుందని, ముఖ్యంగా గోవుకి మరింత ప్రాముఖ్యత వుందన్నారు. గో పంచకానికి విశిష్ట లక్షణాలున్నాయని, ఆరోగ్యానికి ఇది ఉపకరిస్తుందన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా వుండి అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే రైతులతో పాటు రైతులకు సంబంధించిన పశు సంపద అభివృద్ది చెందాలన్నారు. సమాజంలో గోపుల ప్రాశస్త్యంను గుర్తించి, గోపూజ కార్యక్రమానికి ప్రాముఖ్యతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

రానున్న రోజులలో అన్ని దేవాలయాలలో గో మాత ల పూజా కార్యక్రమాలునిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాలు మత ఘర్షణలు రెచ్చగొట్టి లబ్ది పొందాలన్న వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నారు. అన్ని
మతాలు సమానమని, మన సంప్రదాయం ప్రకారం గోవు ప్రాశస్త్యం గుర్తించి ఇలాంటి గొప్ప కార్యక్రమాలనుచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పర్వదినా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ మన దేశంలో, మన సంస్కృతిలోగోమాతకు విశిష్ట స్థానం వుందన్నారు. ప్రతి శుభకార్యంలో ముందు గో పూజ చేస్తారని, గో మాత కు అంతటి ప్రాముఖ్యతవుందన్నారు. కోవిడ్ నేపధ్యంలో పరిమిత సంఖ్యలోనే సమావేశానికి ప్రజలను అనుమతించడంజరుగుతుందని, అందరు సహకరించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

నరసరావుపేట శాసన సభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ హిందు ధర్మ ప్రచార కార్యక్రమంలోభాగంగా టిటిడి ఆధ్వర్యంలో గో పూజ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణంలో నిర్వహించడం అదృష్టంగాభావిస్తున్నామన్నారు. గోవులను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లేనాన్నారు. నరసరావుపేట లో ప్రారంభమయిన గోపూజా కార్యక్రమం అన్ని నియోజకవర్గాలలో టిటిడి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

నరసరావుపేట పట్టణ పరిధిలోని 34 దేవాలయాల పూజారులను, హిందు ధర్మ పరిషత్ సభ్యులనుప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. గో పూజా కార్యక్రమం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమం అయినందున వైసిపినాయకులందరూ సహకరించాలన్నారు.

నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్ కుమార్, టిటిడి, ఆర్ అండ్ బి, పంచాయితీ, రెవెన్యూ, మునిసిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/