హాస్పటల్ లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు..

నటుడు ప్రభు హాస్పటల్ లో చేరారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు నటి నటులు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరుతున్నారు. కొంతమంది క్షేమంగా ఇంటికి తిరిగివస్తుండగా..మరికొంతమంది తిరిగిరాని లోకానికి వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ నటుడు తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె ప్రముఖ నటుడు ప్రభు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు లేజర్​ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయం బయటకు రావడం తో అభిమానులు ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభు ఇటీవలే విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు చిత్రంలో నటించారు. తెలుగు లో కూడా పలు సినిమాల్లో ప్రభు నటించడం జరిగింది. డార్లింగ్, చంద్రముఖి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసాయి.