ఢీ కొన్న ఆర్టీసీ బస్సు లారీ..22 మందికి గాయాలు

Road Accident
Road Accident

మారేడుమిల్లి: ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లి మరియు చితూర్ ఘాట్ రోడ్డులో ఆక్సిడెంట్ సంభవించింది . భద్రాచలం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మరియు చత్తిస్ గఢ్ కి వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన పాలమూరు సమీపంలో జరిగింది. కాగా ,ఈ ప్రమాదంలో లో ఆర్టీసీ డ్రైవర్ రామకృష్ణ,కండక్టర్ రమేష్ తో కలిపి 22 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ 22 మందిని మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం జరగపోవడం వల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి మారేడుమిల్లి పోలీసులు వచ్చి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి. https://www.vaartha.com/telangana/