పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పెద్దపల్లి జిల్లాల్లో బుధువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొట్టింది. దీంతో కారు, బస్సు రెండూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయాయి.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ మృతి చెందారు. మృతుడు మంథని మండలం ఖాన్ సాయిపేట గ్రామానికి చెందిన వినీత్‌గా గుర్తించారు. బస్సు లో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది.