దేశంలో కొత్త‌గా 3,993 క‌రోనా కేసులు

రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతం

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 3,993 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న‌ క‌రోనా వ‌ల్ల 108 మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పింది. నిన్న క‌రోనా నుంచి 8,055 మంది కోలుకున్న‌ట్లు వివ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ మొత్తం 4,24,06,150గా ఉందని చెప్పింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 49,948 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 179.13 కోట్ల డోసుల‌ క‌రోనా వ్యాక్సిన్లు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/