ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురి మృతి

బస్సు టైరు పేలడం వ‌ల్లే యాక్సిడెంట్‌

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయక చ‌ర్యల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్రమాదం జరిగిందని వారు వివ‌రించారు.

ఈ ఘ‌ట‌న‌లో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్ర‌మాదంతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు. కారులోనిమరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. బస్సు టైరు పేలి అదుపు త‌ప్ప‌డం వ‌ల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/