బీసీ సభలో బిఆర్ఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరిగిన మోడీ

మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఈసారి బీసీ సీఎం రాబోతున్నారు. కేంద్ర క్యాబినెట్ లో అత్యధిక మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారే మంత్రులుగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయి. ఎవ్వరూ ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిని తిరిగి రాబడుతాం అని తేల్చి చెప్పారు.

తమ ఆశీర్వాదంతోనే తాను ప్రధాని అయ్యానని అన్నారు. అదే సంకల్పంతో తెలంగాణకు బీసీ సీఎం అవుతారని.. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారని, తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారని మోదీ తెలిపారు. ఈ నెలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. 9 ఏళ్లుగా BC, SC, ST విరోధి అధికారంలో ఉన్నారని, బీఆర్ఎస్‌ నేతల్లో అహంకారం కనిపిస్తోందని, అవినీతి సర్కార్‌ను ఇంటికి పంపడం ఖాయమని, ఢంకా భజాయించి చెబుతున్నా బిఆర్ఎస్ ఓటమి ఖాయమని మోడీ స్పష్టం చేశారు.

నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వ్యతిరేక ప్రభుత్వముందని తెలిపారు ప్రధాని మోడీ. ఒకతరం భవిష్యత్ ని బీఆర్ఎస్ నాశనం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ వేల టీచర్ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. ఉచిత రేషన్ ను మరో ఐదేళ్లు పొడిగించామని తెలిపారు.