ట్విట్టర్‌లో చిరు ఫాలో అవుతున్న ఆ ఒక్కరు ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను తరుచూ పలకరిస్తున్నారు. కాగా తన సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా, ఇతర హీరోల చిత్రాలకు సంబంధించి కూడా ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ సందడి చేస్తుంటాడు.

అయితే చిరంజీవి ట్విట్టర్ అకౌంట్‌ను క్షుణ్ణంగా గమనిస్తే, ఆయన ఒకే ఒకరిని ఫాలో అవుతున్నట్లు మనకు చూపిస్తుంది. ఈ క్రమంలో చిరంజీవి ఎవరిని ఫాలో అవుతున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే చిరు ఫాలో అవుతున్న ఆ వ్యక్తి మరెవరో కాదు.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి. చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఈ రచయితను మాత్రమే ఆయన ఫాలో అవుతుండటంతో ఈ విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మొత్తానికి చిరంజీవి ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని చాలా తక్కువ మంది గమనించగా, చిరు కేవలం రామజోగయ్యను మాత్రమే ఎందుకు ఫాలో అవుతున్నాడనే సందేహం అందరిలో నెలకొంది. ఏదేమైనా చిరు సోషల్ మీడియాలో కూడా తనదైన ప్రత్యేకత చాటుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆయన సోషల్ ఖాతాను తెగ ఫాలో అవుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.