అమెరికా క్యాపిటల్ భవనాన్ని మూసివేసిన అధికారులు

పోలీసు బలగాల మోహరింపు

A car crashed into police Near the Presidential Palace
A car crashed into police Near the Presidential Palace

Washington:  భద్రతా కారణాల కారణంగా అమెరికా క్యాపిటల్ భవనాన్ని అధికారులు మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది. పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీసు అధికారితో పాటు అనుమానితుడిని కూడా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పోలీసు అధికారి ,‌, కాల్పుల్లో గాయపడిన నిందితుడు మృతిచెందాడు. దీంతో క్యాపిటల్ భవనాన్ని అధికారులు మూసివేశారు. భవన భవనం సమీప ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరింప జేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/