బాపు నాదకర్ణి మృతిపై సచిన్‌ సంతాపం

Bapu Nadkarni
Bapu Nadkarni

ముంబయి: భారత మాజీ ఆల్‌ రౌండర్‌ బాపు నాదకర్ణి మృతి పట్ల మాజీ క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, సునీల్‌ గవాస్కర్‌లు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతపాన్ని తెలిపారు. 86 ఏళ్ల బాపు నాదకర్ణి శుక్రవారం కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు నాదకర్ణి 1955-1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన 88 వికెట్లు పడగొట్టడంతో పాటు 1414 పరుగులు చేశారు. ఆ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన తర్వాత జాతీయ సెలక్టర్‌గా కూడా కొంత కాలం సేవలందించారు. 1964లో మద్రాసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 32 ఓవర్లలో 27 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో వరుసగా 21 మెయిడిన్‌ ఓవర్లు ఉండటం ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఇక సచిన్‌ టెంటూల్కర్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ఖాతాలో శ్రీ బాపు నాదకర్ణి మరణం గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంది అన్నారు. ఒక టెస్టులో ఆయన 21 మెయిడిన్‌ ఓవర్లు వేశారనే వార్తలు వింటూ పెరిగాను అని తెలిపారు. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా సంతాపం అని ట్వీట్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/