ఇదే ఉత్సాహంతో ఇకపై కూడా పోరాడాలిః పీసీసీ అధ్యక్షుడు రేవంత్

కాంగ్రెస్ పిలుపుతో కలెక్టరేట్ల ముందు రణ నినాదం చేశారని ట్వీట్

revanth-reddy-posts-protest-of-people-against-dharani-app

హైదరాబాద్‌ః ప్రజలు అన్యాయాన్ని సహిస్తూ ఎంతో కాలం ఉండలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అన్యాయం జరిగితే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధరణి యాప్ చేస్తున్న అరాచకాలకు విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో కదం తొక్కారని… అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు రణ నినాదం చేశారని అన్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్ కలెక్టరేట్ ముందు తనతో కలిసి జనాలు పోరాటానికి పోటెత్తిన దృశ్యం ఇదని ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ వీడియోలో రేవంత్ తో పాటు భారీ సంఖ్యలో జనాలు కలెక్టరేట్ లోకి వచ్చేందుకు యత్నిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. పీసీసీ పిలుపు మేరకు ధరణిపై దండోరా మోగించిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తకు అభినందనలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సమస్యలపై ఇదే ఉత్సాహంతో ఇకపై కూడా పోరాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/