ఎల్లుండి మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర

మునుగోడు..ఇప్పుడు ఈ పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో పాటు కాంగ్రెస్ పార్టీ కి రాజీమానా చేసారు. దీంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఎవరికీ వారే గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ తరుణంలో ఈ నెల 13 న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆజాదీ కా అమృత్ గౌరవ్ యాత్రలో భాగంగా రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. గురువారం గాంధీభవన్ లో చిట్ చాట్ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ..టీఆర్ఎస్, బీజేపీ రెండు ఓక్కటేనని అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను 5 నిమిషాల్లోనే ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నిక టిఆర్ఎస్ కు .. మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని.. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.