విశ్రాంత డీజీపీ ప్రసాదరావు మృతి

అమెరికాలో ఉన్నఆయన చికిత్స పొందుతూ కన్నుమూత

Retired DGP Prasada Rao -File
Retired DGP Prasada Rao -File
  • 1979వ బ్యాచ్ ఐపీఎస్
  • కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఎస్పీగా విధులు
  • ఏసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌ గా సేవలు
  • 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు మెడల్ గ్రహీత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ ప్రసాద్‌ రావు (65) మృతి చెందారు. అమెరికాలో ఉన్న ఆయన చాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. . అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు . 1979వ బ్యాచ్ ఐపీఎస్ అయిన ప్రసాదరావు.. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేశారు. ఏసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌ గా సేవలు అందించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహించారు. . తన సేవలకు గాను 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/