యూట్యూబ్ లో వ్యూస్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘ఊ అంటావా..’ ఫుల్​ వీడియో సాంగ్

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా..’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేయడమే కాదు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో కుమ్మేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. అల్లు అర్జున్ కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వం వచ్చిన పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రీసెంట్ గా మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ ని విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది.

ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా ..ఊర మాస లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక పుష్పలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించింది. గ్రామీణ యువతిగా అమ్మడి నటన అందరిని అలరించింది. ముఖ్యంగా సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులేసి సినిమాకే హైలైట్ గా నిలిచింది.‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా మామ అంటూ అదిరిపోయే స్టెప్స్ తో అందరి చేత ఉ ఊ అనిపించింది. ఇక ఈ ఫుల్ వీడియో సాంగ్ శుక్రవారం సాయంత్రం యూట్యూబ్ లో విడుదల కాగా..విడుదల చేసిన నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్స్ లోకి ఎక్కింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.