చంద్రబాబు కు రామ్ గోపాల్ వర్మ బర్త్ డే గిఫ్ట్

Ram Gopal Varma birthday gift to Chandrababu

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు చంద్రబాబు బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఆయన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి మరీ శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయ ప్రముఖులంతా ఆయనకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులంతా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం చంద్రబాబు కు బర్త్ డే గిఫ్ట్ ను అందజేశారు. బర్త్ డే విషెష్ అందజేసిన వర్మ.. SickoPsycho సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ను చంద్రబాబు ఫై విమర్శలు వచ్చాడు వర్మ. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబుకి ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు ప్రజల జీవితాలను మార్చి వారికి ఒక మంచి జీవితాన్ని శాశ్వత వారసత్వంగా ఇచ్చేందుకు మీరు ఎంత తపన పడుతున్నారో నాకు తెలుసు. మీ కోరికలన్నీ తీరాలి నాన్నా! పుట్టినరోజు శుభాకాంక్షలు!’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.