గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తొలగింపు

వేరే అధికారులను నియమించాలని ఆదేశించాం:
ఈసీ

GNT Collector Syamuel Anand Kumar, GNT Rural SP Vijaya Rao

Amaravati: రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాదని ఈసీ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ఈసీ రమేష్‌కుమార్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నామన్నారు.

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు.

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమేష్‌కుమార్‌ మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు నిలిపివేస్తున్నామన్నారు.

ఎన్నికల కోడ్‌ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారన్నారు.

సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల నియామవళి యధావిధిగా కొనసాగుతుందన్నారు.

ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/