ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల విడుదల

Release of AP Class 10th Hall Tickets

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా సొంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఎఎస్సెస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.