షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని

YouTube video
PM Modi lays foundation stone of Ganga Expressway in Shahjahanpur

షాజ‌హాన్‌పూర్‌ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేడు షాజ‌హాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడిన‌ ప్ర‌ధాని సుమారు 600 కిలోమీట‌ర్ల పొడ‌వైన గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. సుమారు 600 కిలోమీట‌ర్ల పొడ‌వైన గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు ఆయన తెలిపారు.

గంగా ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాప‌న జ‌రుగడంతో ఆ ప్రాజెక్టు ప‌రిస‌ర ప్రాంతాలైన‌ మీర‌ట్, హాపూర్‌, బులంద్‌ష‌హ‌ర్‌, అమ్రోహ‌, సంభాల్‌, బ‌దౌన్‌, షాజ‌హాన్‌పూర్‌, హ‌ర్దోయ్‌, ఉన్న‌వ్‌, రాయ్‌బ‌రేలీ, ప్ర‌తాప్‌గ‌ఢ్‌, ప్ర‌యాగ్‌రాజ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని అభినంద‌న‌లు తెలియ‌జేశారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్త‌యితే ప‌లు కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాట‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. దాంతో స్థానిక యువ‌త‌కు భారీగా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు.

భ‌విష్య‌త్ త‌రం మౌలిక స‌దుపాయాల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అత్యాధునిక రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డానికి ఇంకా ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు. యూపీలోని ఎక్స్‌ప్రెస్ వేస్ నెట్‌వ‌ర్క్‌తో కొత్త ఎయిర్‌పోర్టులు, కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. ప్ర‌జాధ‌నం గతంలో ఎలా దుర్వినియోగ‌మ‌య్యేదో అంద‌రూ చూశార‌ని, పాల‌కులు భారీ ప్రాజెక్టుల‌ను పేప‌ర్ల‌కు ప‌రిమితం చేసి సొంత ఖ‌జానా నింపుకునే వార‌ని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/