హాలీవుడ్ హీరోల మారిన అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ హాలీవుడ్ హీరోల మారాడు. 2015 సంవత్సరంలో వచ్చిన అఖిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు అఖిల్. మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో నాల్గో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, వక్కంతం వంశీ కథతో ‘ఏజెంట్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా అఖిల్ నటిస్తున్నాడు. ఆ పాత్రకు తగ్గరీతిలో అదిరిపోయే మేకోవర్ తో రాబోతున్నాడు. అయితే ఈ పాత్రకోసం అఖిల్ జిమ్ లో గంట తరబడి వర్కవుట్స్ చేస్తున్నాడు. ఈ వర్కౌట్స్ కారణంగా అఖిల్ బాడీ షేప్స్ పూర్తిగా మారిపోయాయి. దానికి సంబదించిన పిక్ ను పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు అఖిల్.

‘ఏజెంట్’ సినిమాలోని లుక్ కోసమే అఖిల్ మజిల్ పవర్ ను చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఫోటోలో మజిల్స్ తో పాటు నరాలు కూడా మెలితిరిగినట్టుగా కనిపిస్తోంది. అఖిల్ ను ఈ విధంగా ఎప్పుడూ చూసి ఎరుగని ఫ్యాన్స్ ఈ లుక్ కు ఫిదా అయిపోతున్నారు. జేమ్స్ బాండ్ తరహా చిత్రానికి ఆ మాత్రం బాడీ ఉండాలని జనం చర్చించుకుంటున్నారు. అక్కినేని వారి వంశంలో ఈ తరహాలో ఎవరూ ఇంత దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించలేదు. ఆ క్రెడిట్ మాత్రం అఖిల్ కే దక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈ కండలు తిరిగిన పోస్టరు… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.