సైకిల్ ఎక్కిన రామ్ చరణ్..

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఈ నెల 29 న ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో చరణ్ సిద్దు అనే ప్రత్యేక పాత్రలో నటించగా..ఆయనకు జోడిగా పూజా హగ్దే నటించింది. చిరంజీవి – చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక ఈ మూవీ తో పాటు శంకర్ డైరెక్షన్లో తన 15 వ చిత్రం చేస్తున్నాడు.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చరణ్ తాలూకా ఓ పిక్ బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఈ పిక్ లో చరణ్ పంచె కట్టులో సైకిల్ తొక్కుతూ వెళ్తున్నట్లు కనిపించాడు. ఈ పిక్ చూసిన చాలామంది ఈ సన్నివేశం సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది కావొచ్చని అంటున్నారు. ‘భారతీయుడు, జెంటిల్ మెన్, అపరిచితుడు’ వంటి చిత్రాల మాదిరిగా ఈ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతుందని టాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ ఓ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.