బ్యాంక్ చీఫ్‌లతో ఆర్‌బిఐ గవర్నర్ సమావేశం

దేశ ఆర్థిక పరిస్థితి.. పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై చర్చ ..

shaktikanta das
shaktikanta das

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ఈరోజు బ్యాంక్‌ చీఫ్‌లతో సమావేశం కానున్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి.. సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారని ఈమేరకు అధికా ర వర్గాలు తెలిపాయి. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఇప్పటికే చేపట్టిన పలు చర్యల అమలుపై నా చర్చిస్తారు. అలాగే వడ్డీ రేట్లు, వాటి బదిలీ, పరిశ్రమకు మద్దతుగా చర్యలు వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఎంఎస్‌ఎంఇ పరిశ్రమ, గ్రామీణ రంగానికి అనుకూలంగా చేపట్టిన విధానాలను కూడా సమీక్షిస్తారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలకు గాను బ్యాంక ర్ల నుంచి సలహాలు, సూచనలను కూడా స్వీకరించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/