తెలంగాణలో కొత్తగా 2,207 కేసులు

మొత్తం కేసులు 75,257..మొత్తం మృతులు 601

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 532 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 75,257కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 12 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 1,136 మంది బాధితులు డిశ్చార్జి కాగా, 53,239 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,66,984 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 14,837 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. రాష్ట్రంలో రికవరీ రేటు 70.7 ఉందని, ఇది దేశ సగటు (67.62శాతం) కంటే ఎక్కువ అని వివరించింది.

జిల్లాల వారిగా కరోనా కేసులు


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/