సంక్రాంతి రోజున రవితేజ ‘రావణాసుర’ మూవీ ఓపెనింగ్ ..

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం రావణాసుర మూవీ ఓపెనింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ‌కాంత్ విస్సా కథ అందిస్తున్నాడు.దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ లుక్ లో రవితేజ సింహాస‌నం పై కూర్చుని.. రావ‌ణాసురుడిలా.. ప‌ది త‌ల‌లు ప్ర‌తిబింబించేలా కనిపించాడు.

ఇక ఈ మూవీ పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్​లో జనవరి 14న ఉదయం 9.50 గంటలకు జరగనున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మరి ఈ మూవీ కథ ఏంటి..? సినిమా కాస్ట్ & క్రూ ఏంటి అనే వివరాలు ఓపెనింగ్ రోజునే తెలియనున్నాయి. ఇక ర‌వితేజ చేతిలో చాలా సినిమాలున్నాయి. రమేష్ వర్మ డైరెక్షన్లో చేస్తున్న ఖిలాడీ రెడీ అయ్యింది. రామారావు సెట్స్‌పై ఉంది. ధ‌మాకా, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలు లైన్లోనే పెట్టాడు. రామారావు షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే.. రావణాసుర ను సెట్స్ పైకి తీసుకెళ్తాడు కావొచ్చు.