రావణాసుర క్లోజింగ్ కలెక్షన్స్..

ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజ రావణాసుర తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి ఆట తోనే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 11.95 కోట్లు క్లోజింగ్ కలెక్షన్స్ తో ముగిసింది. మరో 11 కోట్ల వరకు సినిమాకి నష్టం వచ్చింది.

ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో – 4 కోట్ల షేర్

సీడెడ్ లో – 1.5 కోట్ల షేర్

ఉత్తరాంధ్రలో – 1.5 కోట్ల షేర్

గుంటూరులో – 85 లక్షలు షేర్

తూర్పుగోదావరిలో – 85 లక్షలు

పశ్చిమగోదావరిలో – 85 లక్షలు

కృష్ణాలో – 65 లక్షలు

నెల్లూరులో – 40 లక్షలు షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల షేర్ రావణాసుర ఓవరాల్ గా కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు, ఓవర్సీస్ మార్కెట్ లో కోటి ఐదు లక్షలు షేర్ తో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 11.95 కోట్ల షేర్ రాబట్టింది.