మంచుకొండల మధ్య హాలీడేస్ ఎంజాయ్!

సోషల్ మీడియాలో మెగాపవర్ స్టార్ ఫొటోలు వైరల్

Rancharan: Enjoying Holidays in the Snowy Hills

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు . పబ్లిసిటీ కోసం ఇద్దరు హీరోలు కూడా బిజీ అవుతారు కనుక ముందుగానే ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ను గడుపుతున్నారు. ఎన్టీఆర్ ఇటీవలే కుటుంబంతో కలిసి పారిస్ వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా దాదాపు వారం రోజులు గడిపి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారు .,రామ్ చరణ్ కూడా తన హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మంచు కొండల మద్య నిల్చుని ఉన్న ఫొటో ను చరణ్ షేర్ చేశాడు.. ఎప్పుడు ఈయన వెకేషన్ కు వెళ్లాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మంచు కొండలో విహరిస్తున్న చరణ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/