రామ్మా చిలకమ్మ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అల్ టైం హిట్స్ సాంగ్స్ ను ఇప్పటివరకు మెగా హీరోలు , ఇతర హీరోలు తమ సినిమాల్లో రీమిక్స్ చేయడం ..ఆ చిత్రాలు సూపర్ హిట్స్ కావడం మనం చూసాం. ఇక ఇప్పుడు తన సూపర్ హిట్ సాంగ్ ను తానే రీమిక్స్ చేయబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేర్ వీరయ్య తో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి..ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా ఈ సినిమాలో చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మా సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. గుణ శేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ అప్పట్లో దుమ్ములేపింది. చిరు – సౌందర్య ఈ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేశారు. అందుకే ఈ సాంగ్ ను ఇప్పుడు భోళా శంకర్ లో రీమిక్స్ చేసారని అంటున్నారు. ఒకవేళ ఇదే కాని నిజమైతే భోళా శంకర్ పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. సినిమా సమ్మర్ తర్వాత విడుదల కానుంది. కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్‌, కె ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.