గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తును తరగతి గదుల్లో నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉందని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తెలిపారు. ‘బాధ్యతాయుత పౌరులుగా బాల బాలికలను తీర్చిదిద్ది, దేశభవిష్యత్తును తరగతి గదుల్లో నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. అందుకే ‘గురుబ్రహ్మ’గా పోల్చి, దైవ సమానులుగా ప్రవచించారు. ఎంతో నిబద్దతతో తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు

.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/