రామారావు ఆన్ డ్యూటీ వాయిదా..

మాస్ మహారాజా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ వాయిదా పడింది. క్రాక్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ..ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అతి త్వరలో రమేష్ వర్మ డైరెక్షన్లో చేస్తున్న ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావ్ అనే సినిమా కూడా చేస్తున్నారు. వీటితో పాటు శరత్ మాండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమాను మార్చి 25 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదికి విడుదల చేయడం లేదని నిర్మాత తెలిపారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని శరత్ మండవ ట్వీట్ చేశారు. భవిష్యత్తు అంతా కూడా వైరస్ ఫ్రీ గా ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ మూవీ తప్పుకోవడంతో మిగతా సినిమాల తేదీలు మారుతున్నాయి. రామారావు కూడా అలాగే మారిందని అంటున్నారు.

ఇక రామారావు విషయానికి వస్తే.. దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.