బాలీవుడ్ లో పుష్ప కలెక్షన్స్ దుమ్ములేపుతున్నాయి

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ ‘పుష్ప : ది రైజ్’ ‘ చిత్రం.. డిసెంబర్ 17న పాన్ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో బన్నీ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుండడం తో అక్కడి నిర్మాతలు , హీరోలు షాక్ అవుతున్నారు.
పుష్ప హిందీ వెర్షన్ 13 రోజుల్లో 45.5 కోట్లను వసూలు చేసిందంటే బన్నీ ఏ రేంజ్ లో కుమ్మేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. దిల్లీలో సినిమా థియేటర్లు మూతపడడంతో ‘పుష్ప’ హిందీ కలెక్షన్లపై ప్రభావం పడనుందని భావిస్తున్నారు. అయితే ‘పుష్ప’ హిందీకి మహారాష్ట్ర- గుజరాత్ ల నుంచి అత్యధికంగా 60 శాతం వసూళ్ల దందా సాగింది. రెండవ వారంలో పుష్ప హిందీ మొదటి వారం కలెక్షన్ కు దాదాపు 20 కోట్లను జోడించవచ్చని అంచనా. మొత్తం మీద అందరు ఆశ్చర్య పడేలా పుష్ప నార్త్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుండడం తో సెకండ్ పార్ట్ ఫై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక ఫిబ్రవరి నుండి పార్ట్ 2 సెట్స్ పైకి సెకండ్ పార్ట్ రాబోతుంది. కేవలం 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనీ సుకుమార్ ఫిక్స్ అయ్యాడట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే.. మే నెల నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇక సెకండ్ పార్ట్ లో మదర్ సెంటిమెంట్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉందట. దాన్ని నిడివి తగ్గించి.. ఫహద్ ఫాజిల్ కు , బన్నీకి మధ్య వచ్చే సీన్స్ లెంత్ పెంచే ఆలోచనలో ఉందట టీమ్. అలాగే బన్నీ, రష్మికల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా పెంచుతున్నారట.