ఒక్క సెన్సార్ కట్ లేకుండా రామబాణం

లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రామబాణం. మే 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తీ చేసారు. సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లిన్ యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

ఈరోజుల్లో సెన్సార్ కట్స్ లేని సినిమాలు లేవనే చెప్పాలి. చాలా మంది తమ పిల్లలు ఫ్యామిలీతో సినిమాలు చూడాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారు. సినిమాల్లోని సీన్స్ అలా ఉంటుంది. సెన్సార్ తర్వాత కూడా సినిమా చూడాలంటే ఇబ్బందిపడుతున్న రోజులివి. అలాంటిది ఒక కట్ కూడా లేకుండా సినిమా రావడం అంటే చాలా గొప్ప విషయమని సెన్సార్ సభ్యులే చెప్పడం విశేషం. కాబట్టి ప్రేక్షకులు కుటంబ సమేతంగా ఈ సినిమాని వీక్షించవచ్చు.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటించారు. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.