ది వారియర్ ట్రైలర్ టాక్ – ఆపరేషన్ స్టార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఎలా ఉందంటే థియేటర్స్ లో వార్ మొదలైనట్లే అనే చెప్పొచ్చు.

‘ఒక చెట్టు మీద 40 పావురాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే.. ఇంకా ఎన్ని ఉంటాయి? అన్నీ ఎగిరిపోతాయి..’ అంటూ రామ్ రౌడీ మూకల్లో ఒకరిని షూట్ చేయడంతో ఈ ట్రైలర్ మొదలైంది. మొదలైనప్పటి నుండి ట్రైలర్ ఎండ్ అయ్యేవరకు పూర్తి యాక్షన్ తో ..మాస్ డైలాగ్స్ తో రామ్ అదరగొట్టాడు.

ట్రైలర్లో సింగిల్ డైలాగ్ తో కృతిశెట్టి అదరగొట్టడమే కాదు..క్యూట్గా కనిపించింది. పర్ఫెక్ట్ పోలీస్గా ఉన్న రామ్ను లవర్ బాయ్గా మార్చే ప్రక్రియ ఆకట్టుకుంటుంది. కర్నూల్ డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న రామ్.. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటానని హెచ్చరిస్తున్నాడు. హీరోయిన్ కృతి శెట్టి రేడియో జాకీగా అలరిస్తోంది. వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి క్రూరమైన విలన్ గురు గా కనిపించాడు.

మనిషి అనేవాడు బలంతో బ్రతకాలి లేదా భయంతో బ్రతకాలి.. మర్డర్లు చేయడానికి నేను మతాలను చూడను అని రాయలసీమ స్లాంగ్ లో వార్నింగ్ ఇవ్వడంతో అతని పాత్రను పరిచయం చేసారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అయిన రామ్.. శక్తివంతమైన ప్రతినాయకుడు ఆది మధ్య వార్ నే ‘ది వారియర్’ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చివర్లో ఊరికి పట్టిన రోగం వేరు..ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ స్టార్ట్ అంటూ రామ్ చెప్పే డైలాగ్..హీరో విలన్ మధ్య జరిగబోయే వార్ను ప్రతిబింబిస్తుంది. మొత్తానికి డైరెక్టర్ లింగుస్వామి సూపర్ పవర్‌ఫుల్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు డి.వై. సత్యనారాయణ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా..జులై 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.