యుద్ధ వీరులకు నివాళులర్పించిన రాంచరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యుద్ధ వీరులకు నివాళ్లు అర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యుద్ధ వీరులకు నివాళులు కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులతో పాటు పలు స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను జరుపుకోవడం గర్వంగా ఉందన్న రామ్ చరణ్.. దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోకూడదని, ఇవాళ దేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వల్లే అని కొనియాడారు.

ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చరణ్..ఈ నెల 29 న తండ్రి చిరంజీవి తో కలిసి చేసిన ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో పూజా హగ్దే , కాజల్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈరోజు సాయంత్రం యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా రాజమౌళి , ఎన్టీఆర్ , మహేష్ బాబు లు వస్తారనే ప్రచారం జరుగుతుంది.