సర్కారు వారి పాట నుండి టైటిల్ సాంగ్ రిలీజ్

సర్కారు వారి పాట నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. నిన్నటితో షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడ్ చేసింది. మరోపక్క ఈ చిత్రంలోని ఒక్కో సాంగ్ అభిమానులను , శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలువగా.. ఈరోజు శనివారం మూడవ సింగిల్ ను విడుదల చేసారు. చిత్ర టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

‘సరా సరా సరా సరా సర్కారు వారి పాట.. షురూ షురూ అన్నాడు రా అల్లూరి వారి బేటా.. సరా సరా సరా సరా సర్కారు వారి పాట.. ఇరా గిరా గిస్తాడు రా ఇవ్వాల్సినోడి కోటా..’ అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని థమన్ ఈ ఫాస్ట్ బీట్ ట్యూన్ చేంజ్ కంపోజ్ చేసారని అర్థం అవుతుంది. ఫుల్ ఎనర్జీతో సాగిన ఈ పాటను సింగర్ హారిక నారాయణ్ హై పిచ్ వాయిస్ తో ఆలపించారు. ఇది సినిమాలో మహేశ్ బాబు పాత్రకు సంబంధించిన పాట. గీత రచయిత అనంత్ శ్రీరామ్ రాసిన ‘వెపన్స్ లేని వేటా.. రివర్స్ లేని బాటా’ అంటూ మహేష్ కఠినంగా వ్యవహరించే విధానాన్ని సూచిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video