డ్రగ్స్ కేసు..ముంబయి చేరుక్ను రకుల్, దీపిక
ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న రకుల్

ముంబయి: డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురికి అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు పలువురు సెలబ్రిటీలు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్ ప్రీత్ సింగ్ చేరుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ప్రియురాలు రియాతో డ్రగ్స్ చాటింగ్ గురించి అధికారులు రకుల్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, హీరోయిన్ దీపికా పదుకొనే కూడా కాసేపట్లో అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి నిన్న రాత్రి ఆమె గోవా నుంచి ముంబయికు వచ్చారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటన అనంతరం విచారణ జరుపుతోన్న అధికారులకు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల కోణం గురించి తెలిసిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణేతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లకు కూడా అధికారులు సమన్లు జారీ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/