టక్ జగదీష్ ఎలా ఉందంటే..

నాని – రీతు వర్మ జంటగా నిన్నుకూరి ఫేమ్ శివనిర్వాణ డైరెక్షన్లో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ తెరకెక్కించిన చిత్రం టక్ జగదీష్. నాజర్‌, జగపతి బాబు, రావు రమేశ్‌, నరేశ్‌ తదితరులు నటించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా కారణంగా రిలీజ్ కు బ్రేక్ పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈరోజు వినాయకచవితి సందర్భాంగా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.

ఇక ఈ మూవీ విషయానికి వస్తే..

భూదేవిపురం గ్రామానికి చెందిన టక్‌ జగదీష్‌ ( జగదీష్‌ నాయుడు) కు కుటుంబం అంటే ఎంతో ఇష్టం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసు (జగపతి బాబు)కి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు. మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్‌)అంటే జగదీష్‌కి ప్రాణం. అలాంటి మేనకోడలును తనకు తెలియకుండా పెళ్లి చేస్తారు. ఈ విషయం తెలుసుకొని ఊర్లోకి వచ్చేసరికి..తన కుటుంబ సభ్యులంతా విడిపోతారు. అలాగే తన కుటుంబం ఫై గ్రామస్థులు ఆగ్రహంతో ఉగిపోతుంటారు. అసలు కుటుంబ సభ్యులు ఎందుకు ఇలా విడిపోయారు..? తన కుటుంబాన్ని ఎందుకు గ్రామస్థులు ద్వేషిస్తున్నారు..? ఇందులో రీతు వర్మ పాత్ర ఏంటి? అనేవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :

  • నటి నటుల యాక్టింగ్
  • గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్
  • సాంకేతిక వర్గ పనితీరు

మైనస్ :

  • తెలిసిన కథే
  • మ్యూజిక్

డైరెక్టర్ పని తీరు :

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ.. ఇప్పుడు టక్‌ జగదీష్‌తో ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రాసుకొచ్చాడు. కాకపోతే తెలిసిన కథనే రాసుకొచ్చాడు తప్ప కొత్తదనం లేదు. కాకపోతే నాని పాత్రను డిజైన్ చేసిన తీరుతో సినిమాను ఆసక్తిగా మార్చడమే కాకుండా ఓ కుటుంబ కథా చిత్రమనే ఫీలింగ్ కల్పించడంలో సక్సెస్ అయ్యాడు. కథ, కథనాలను పక్కాగా రాసుకొన్నాడని చెప్పవచ్చు. కథలో పాత్రలను చాలా ఎమోషనల్‌గా మార్చడం సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. ఎప్పటిలానే ఎమోషన్స్, డ్రామాతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్‌.

ఫైనల్ : భారీ అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూస్తే నచ్చుతుంది.