అంబేద్క‌ర్‌కు కేటీఆర్ ఘ‌న నివాళులు

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3తోనే తెలంగాణ ఏర్పాటు

హైదరాబాద్ : నేడు అంబేద్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని మంత్రి కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాట‌య్యేందుకు అంబేద్క‌ర్ బాట వేశార‌ని, ఆయన రాసిన భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్ర‌కార‌మే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింద‌ని తెలిపారు. అంతేకాకుండా జీవితం సుదీర్ఘంగా ఉండేదానికంటే గొప్ప‌గా ఉండ‌ట‌మే మేలంటూ అంబేద్క‌ర్ చెప్పిన మాట‌ను కూడా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/