ప్రభుత్వ దవాఖనలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి

puvvada ajay kumar
puvvada ajay kumar

ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖనలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖన అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పారు. కొవిడ్ తో పాటు ఇతర అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు కల్పించినట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా దవాఖానల్లో మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు ప్రసూతి సెంటర్ ను అభివృద్ధి చేసి చిన్నారులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, నగర మేయర్ డాక్టర్ విజయ్ కుమార్, టిఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు మురళీ, పలువురు కార్పొరేటర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/