ఎల్‌ఏసీ నుండి చైనా దళాలను ఉపసంహరించాలి

గొడ‌వ‌ల‌కు దారి తీయ‌వ‌ద్దు చైనాకు తెగేసి చెప్పిన భారత్‌

rajnath-singh-meets-his-chinese-counterpart-in-moscow-amid-border-tension

మాస్కో: భారత్‌ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి ఫెంగితో మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. భేటి అనంతరం త‌న ట్విట్ట‌ర్ ద్వారా విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో శాంతి స్థాప‌న కోసం రెండు దేశాలు నిరంతం చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తూ ఉండాల‌న్నారు. దౌత్య‌ప‌ర‌మైన‌, సైనిక‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌న్నారు. ఎల్ఏసీ వ‌ద్ద శాంతి, సామ‌ర్యం ప‌రిఢ‌విల్లాలంటే చైనా త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల‌ని, అప్పుడు ఉద్రిక్త‌తలు త‌గ్గుతాయ‌ని రాజ్‌నాథ్ తెలిపారు. ప్ర‌స్తుతం ఎల్ఏసీ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితిన బాధ్య‌తాయుతంగా హ్యాండిల్ చేయాల‌న్నారు. రెండు వైపుల వారు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోరాద‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రు దూకుడుగా వ్య‌వ‌హ‌రించినా.. అప్పుడు ప‌రిస్థితి మ‌రింత క్లిష్టంగా మారుతుంద‌ని, దాంతో బోర్డ‌ర్ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారుతుంద‌ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

భార‌త్‌తో క‌లిసి చైనా దళాలు ఎల్ఏసీ వ‌ద్ద నుంచి ఉప‌సంహ‌రించాల‌ని స‌ల‌హా ఇచ్చారు. దీని గురించి చైనా చ‌ర్చించాల‌న్నారు. కీల‌కంగా మారిన పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద నుంచి ద‌ళాలు వెన‌క్కి వెళ్లాల‌న్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్ర‌కారం ఈ చ‌ర్య చేప‌ట్టాల‌ని రాజ్‌నాథ్ సూచించారు. నాయ‌కుల మ‌ధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు గుర్తించాల‌ని, దాని ద్వారానే రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో శాంతి విక‌సిస్తుంద‌ని, ఇది ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేధాలు.. గొడ‌వ‌ల‌కు దారి తీయ‌వ‌ద్దు అని రాజ్‌నాథ్ అభిప్రాయ‌ప‌డ్డారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/