అవినీతికి చరమగీతం పాడాలి

రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెట్టాలి

Corruption must end
Corruption

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖలో అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. చేయి తడపనిదే ఫైల్‌ కదిలే పరిస్థితి లేదు.

అవినీతినిరోధక శాఖ అధికారులు ఒకవైపు లంచావతారుల భరతం పడుతున్నా మరోవైపు బహిరంగం గానే లంచాలు తీసుకోవడానికి బరితెగిస్తూ రెవెన్యూశాఖను అప్రతిష్టపాలు చేస్తున్నారు.

నగరాలు,పట్టణ శివారు ప్రాంతా లలో భూముల ధరలు అధికంగా పెరగడం, వివాదం ఉన్న భూముల వివరాలు తెలుసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే వారితో నేరుగా డీల్‌ కుదుర్చుకుని కోట్లాదిరూపాయలు సంపాదించి విలాస జీవితం గడుపుతున్నారు.

‘సత్యమేవ జయతే అనే నినాదాన్ని కొందరు రెవెన్యూ అధికారులు అపవిత్రం చేస్తూ రెవెన్యూశాఖకి మచ్చ తెస్తున్నారు.

రెవెన్యూ శాఖ పరువ్ఞ,ప్రతిష్టలను మంటగలుపుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు బహిరంగంగానే భూ వివాదాలలో తలదూర్చి అక్రమ సంపాదనకు పాల్పడు తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న తాహసిల్దార్లు ఇటీవలకాలంలో మరీ లంచాలకు బరితెగిస్తున్నట్లు తెలుస్తుంది.

2018 సంవత్సరంలో రెవెన్యూశాఖలో సుమారు 50 మంది రెవెన్యూ అధికారులులంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.

2019లో 63మందిరెవెన్యూ అధికారులు పట్టు బడినట్లు స్పష్టమైన ఆధారాలు తేట తెల్లంచేస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్య మంత్రి సైతం పలుమార్లు రెవెన్యూ అధికారులను అవినీతిపై హెచ్చరిస్తున్నా వారి వ్యాఖ్యలను తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు.

రెవెన్యూశాఖకేచ ెడ్డపేరు తెస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారులు లంచాలకు పాల్పడుతున్నట్లు ఆధారాల ద్వారా స్పష్టమవ్ఞతున్నది.

రెవెన్యూశాఖ అధికారులు ఇకనైనామారాలి. ఈ అవినీతి అక్రమాలకు చరమగీతం పాడాలి. ప్రభుత్వం కూడా అవినీతి అధికారులను ఉపేక్షించకూడదు.

అవినీతి అధికారులను ఉద్యో గంనుండి శాశ్వతంగా తొలగించాలి.

వారి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.ఎసిబి కేసులలోని అవినీతి అధికారులకు త్వరతగతిన శిక్షలు పడేలాచర్యలుతీసుకోవాలి.

అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై నిర్ణీత కాలంలో ఎసిబి నివేదికను రూపొందించినా వారిపై శాఖాపర మైన విచారణ చేయకుండా సంబంధిత విభాగాలు జాప్యం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే రెవెన్యూ శాఖలో నిత్యం ఎవరోఒకరి మీద ఆరోపణలురావడం, అవి నీతి నిరోధకశాఖకి పట్టుబడడం సర్వసాధారణమైపోయింది.

రెవెన్యూ అనగానే ‘ఛీ’కొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అని మండలాల తహసీల్దారులు, సిబ్బందిపై నిఘా పెట్టాలి.

  • కామిడి సతీష్‌రెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/