రాజస్థాన్ అద్భుత జయకేతనం

క్రిస్ మోరిస్ వీరోచిత బ్యాటింగ్

Rajasthan is a marvelous victory
Rajasthan is a marvelous victory

ఐపీఎల్‌లో గురువారం రాజస్థాన్ అద్భుత జయకేతనం ఎగురవేసింది.. . చివరి రెండు ఓవర్ల వరకూ ఢిల్లీ వైపు మొగ్గిన మ్యాచ్ ఆపై క్రిస్ మోరిస్ వీరోచిత బ్యాటింగ్ (18 బంతులు నాలుగు సిక్స్ లతో 36)తో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (51) చేసాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. బట్లర్ 2, వోహ్రా 9, సంజూ శాంసన్ 4, శివమ్ దూబే 2 పరుగులు చేసి అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి దిశగా వెళుతుందని అందరూ భావించారు, అయితే డేవిడ్ మిల్లర్ (62) తో పరిస్థితి మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/