కొరటాల కోసం అప్పుడు మొక్కలు.. మరి ఇప్పుడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేశాడు తారక్. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు తారక్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

ప్రతి సినిమాలో ఏదో ఓ సమస్యపై హీరోను పోరాడేలా చేసే కొరటాల, ఈ సినిమాలో ఎలాంటి సమస్యను ప్రేక్షకులకు చూపిస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మొక్కల రక్షణ, ప్రజలను కాపాడటం అనే అంశాలను కొరటాల మనకు చూపించాడు. ఇప్పుడు ఆచార్య చిత్రంలో ఆలయాల రక్షణకు సంబంధించిన సమస్యను మనకు చూపెట్టేందుకు రెడీ అయ్యాడు.

అయితే తారక్‌తో తన నెక్ట్స్ మూవీలో పల్లెటూరి నుండి సిటీకి వచ్చిన ఓ యువకుడు దేనికోసం మారిపోతాడు అనే అంశాన్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడట కొరటాల. ఈ సినిమాలో తారక్ చాలా కొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి కొరటాల కోసం ఈసారి తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తాడో తెలియాలంటే ఈ సినిమా ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.