హైద‌రాబాద్‌లో మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ
అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబ‌రు 040-21111111

హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షం కురవ‌డంతో ప‌లు కాల‌నీలలో నీళ్లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ఇదిలావుండగా, మరోపక్క, ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచి హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ చేసిన సూచ‌న‌ల మేర‌కు జీహెచ్ఎంసీ ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జీహెచ్ఎంసీ సూచ‌న‌లు చేసింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబ‌రు 040-21111111కు ఫోను చేయాల‌ని చెప్పింది. నిన్న రాత్రి కురిసిన వర్షాల‌కు నీటితో నిండిపోయిన కాల‌నీల్లో జీహెచ్ంఎసీ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/