నేడు ఈడీ ఎదుట హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.  సోమవారం ఉదయం రాహుల్ ఈడీ కార్యాలయానికి వెళ్లానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. కాంగ్రెస్ నేతల ర్యాలీకి అనుమతి నిరాకరించిన దిల్లీ పోలీసులు… ఆ పార్టీ కార్యాలయాన్ని బారిగేట్లతో దిగ్బంధించారు. దిల్లీ పోలీసులు వద్ద ఉన్న జాబితాలోని సీనియర్ నేతలకే అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.మరోవైపు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, సీడబ్ల్యుసీ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/