కర్ణాటక సీఎం ఎంపికపై ఉత్కంఠ.. మల్లికార్జున ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ

గెలిచిన ఎమ్మెల్యేలతోను సమావేశమైన రాహుల్, ఖర్గే

Rahul Gandhi meets Congress chief Mallikarjun Kharge, discusses government formation in Karnataka

న్యూఢిల్లీః కర్ణాటకలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే ఇద్దరూ ఎవరికి వారు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నిన్ననే పూర్తి కావాల్సిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఇప్పటికీ పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ ఆయనతో ఏకాంత చర్చలు జరిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఖర్గే, రాహుల్, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో పాటు కర్ణాటక నుండి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కూడా సమావేశమయ్యారు. కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు పరిశీలకులను నియమించింది. ఆదివారం బెంగళూరులో నిర్వహించనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం వీరి పర్యవేక్షణలో జరగనుంది.