జైల్లో చదివేందు ఆ మూడు పుస్తకాలు కావాలి..కేజ్రీవాల్

Kejriwal needs those three books to read in jail

న్యూఢిల్లీః జైల్లో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు. మద్యం అంశానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కేజ్రీవాల్‌ని ఈ నెల 21న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ కస్టడీకి అప్పగించింది. నేడు కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది దరఖాస్తు సమర్పించారు.

తనకు జైల్లో చదివేందుకు రామాయణం, భగవద్గీత కావాలని, అలాగే జర్నలిస్ట్ నీరజా చౌదరి రాసిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకం కావాలని, వాటిని అందుబాటులో ఉంచాలని కోరారు. ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని కోరారు. ఇప్పటికే ధరిస్తోన్న లాకెట్‌ను అనుమతించాలని కోరారు.