జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం: మంత్రి తలసాని

balkampet-yellamma-kalyanam-on-july-5..-minister-talasani

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా నూతన చీర తయారీని ఆలయ ఆవరణలో మంత్రి ప్రారంభించారు. జులై 5వతేదీన అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరుగుతుందని అన్నారు. ఈసారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.

అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 30 నుండి ప్రారంభమయ్యే బోనాలను ఘనంగా నిర్వహించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురువారం నుండి గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయన్నారు. జగదాంబ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ చేయడం జరుగుతుందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/