పార్లమెంట్‌ వద్ద రాహుల్‌-కాంగ్రెస్‌ ఎంపిల నిరసన

ఢిల్లీలో జరిగిన హింసపై ఆగ్రహం

YouTube video
Rahul Gandhi and Congress MPs protest outside the parliament

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ, పార్టీ నేతలు ఈరోజు ఉదయం పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఢిల్లీలో జరిగిన హింసపై నిరసన తెలిపారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి కాంగ్రెస్‌ ప్రయతిస్తోంది. ఎన్డీఏయేతర పార్టీలన్నీ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నాయి. పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగకుండా బిజెపి ప్రయత్నాలు జరుపుతోందని టీఎంసీ రాజ్యసభ నేత ఒబ్రెయిన్‌ ఈ రోజు విమర్శలు గుప్పించారు. పార్లమెంటు రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ‘ఢిల్లీ హింస’పై చర్చకు ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఈ రోజు పార్లమెంటులో తాను తప్పకుండా ఈ అంశంపై మాట్లాడి తీరుతానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/