నేడు గ్రేట్‌వాల్‌ ద్రవిడ్‌ పుట్టిన రోజు

పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షల వెల్లువ

Rahul Dravid
Rahul Dravid

న్యూఢిల్లీ: గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శనివారం తన 47 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్‌ సేవలందించారు. భారత్‌ కష్టాల్లో ఉన్న ప్రతీసారి వికెట్ల మధ్య అడ్డుగోడలా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. టీమిండియా చరిత్రలో నెం. 3లో అత్యుత్తమ ఆటగాడు ద్రవిడ్‌ అంటూ కొందరు నెటిజన్లు అభినందనలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలతో అనే హ్యాష్‌ టాగ్‌ దేశంలోనే నెం.1 ట్రెండింగ్‌లో నిలిచింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/